పురుషార్థములు

8. పురుషార్థములు

శ్లో||  ఓం ధర్మజ్ఞం ధార్మికం ధీరం |ధర్మాత్మానం దయానిధిమ్‌ |
       ధర్మశాస్త్రప్రవక్తారం పరాశర మునిం భజే ||

ధర్మార్థ కామమోక్షములు :

1. ధర్మము : 
సదాచారముదమముఅహింసదానముస్వాధ్యాయముయజ్ఞమునిత్య నైమిత్తిక కర్మలుమొదలగు వేద ప్రమాణమైనవిశ్రేయోమార్గములో ప్రవేశపెట్టుటకు చేయవలసిన విహితకర్మలుదేనివలన ఆత్మ దర్శనము కల్గునో అట్టి సాధనలు.

2. అర్థము 
లోకములో మానవులకు ఇష్టముప్రయోజనము అయిన సుఖ సాధనములకు ఏది అవసరమోఆ సంపత్తును అర్థము అందురు.

3. కామము : 
సర్వక్రియలకు ఏది హేతువోమోక్షమును కోరుటకు కూడా ఏది కారణమోఅది సంకల్పము లేక కామము అనబడును.

4. మోక్షము : 
తీవ్ర మోక్షేచ్ఛతో అర్థ కామములను నివృత్తి చేసికొనిన మీదట మోక్షమునకు ప్రతిబంధకము తొలగును.
         ధర్మార్థ కామములుమానవుని ప్రవృత్తి. కాని అర్థకామములను ధర్మముగా ఆచరించుట వలన మోక్షమునకు దారితీయును. ధర్మము వలననే అర్థకామములు రెండూ ప్రభవించుచున్నవి. జనులు బాహ్యమైన అర్థకామములనే సేవించుచున్నారు. వీటికి మూలమైన ధర్మమును విస్మరించుచున్నారు. పరమ పురుషార్థమైన మోక్షముధర్మము నాచరించుట వలననే సిద్ధించును.
              ధర్మము జీవితములో సాపేక్షమైనది. కాని మోక్షము నిరపేక్షము. సామాన్యమైన ధర్మము ప్రవృత్తి. మోక్ష సాధనా ధర్మము నివృత్తి రూపముప్రవృత్తి రూపము అర్థకామములకు మూలము. నివృత్తి రూపము యొక్క లక్ష్యము మోక్షము. అర్థము బాహ్యమైనది. కామము అభ్యంతరమైనది. ఈ రెండింటికీ మూల భూతము ధర్మము. ధర్మమును అతిక్రమించి సాధించిన అర్థకామములు అశాశ్వతముప్రమాదముఅనర్థముభయ దుఃఖజనకము. చివరకు వినాశనము. అర్థకామాదుల సాధనకై చేసే ధర్మాచరణలో విఘ్నములుకష్టములు ఎదురై కాలహరణమైనప్పటికిని ఓర్పుత్యాగముధైర్యములను నిలబెట్టుకొనవలెను. అప్పుడు ఇహపరములలో కూడా సత్ఫలితములు కల్గును. కీర్తి ప్రతిష్ఠలు పెరుగును
         ధర్మమును ప్రాతఃకాలములోనుఅర్థమును పగటి వేళలోనుకామమును రాత్రి వేళలోనుధర్మయుతముగా ఆచరింపవలెను.
         ధర్మమే మొదట ప్రవృత్తి రూపముగాఅర్థకామములను అనుభవింపజేసి వాటిని మరల నివృత్తి రూపముగా అంతము చేయును. ద్వైతరూపమైనఇహపరానుభవములనుఅద్వైత రూపమైన ఆత్మానుభవముగా మార్చిచూపుచున్నది.

ధర్మాత్ములు : తల్లితండ్రిగురువుఅగ్నిఆత్మ. ఈ ఐదింటిని పూజించువారు ధర్మాత్ములు.

ధర్మములు : 1. వేద విహితము 2. శాస్త్ర విహిత శిష్టాచారము.

దర్పము : 
ఏ వృత్తి పుట్టినందుకు పురుషుడు ధర్మమార్గమును దాటి ప్రవర్తించునో అట్టి వృత్తిని దర్పము అందురు.

స్వధర్మము : 
వర్ణాశ్రమ ధర్మములువైదిక విధి నిషేధములను పాటించుటనియమిత ధర్మములనులోక కళ్యాణము కొఱకు సహజీవుల క్షేమము కొఱకుసర్వుల స్థైర్య అభయ విజయ దృష్టితో కౌశలముగా నిర్వర్తించుట స్వధర్మము అనబడును.

ధర్మసందేశము : 
ధర్మము తెలిసినవారు ధర్మమునకు ఇబ్బంది కల్గించే ధర్మమును ధర్మముగా భావించరు. ధర్మమనేది సర్వులకు హితమై యుండవలెను. సమష్టి ధర్మమునకువ్యష్టి ధర్మమునకు వైరుధ్యము ఉన్నప్పుడువ్యష్టి ధర్మమును త్యాగము చేయవలెను. భీష్ముడు వ్యష్టి ధర్మాచరణ కొఱకు సమష్టి ధర్మమునకు హాని చేయుటవలన చావవలసి వచ్చినది. శ్రీ శంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశము వలన సన్న్యాస ధర్మమును వదలెను. విజయవంతముగా అద్వైత సిద్ధాంత స్థాపన కొఱకు ఆ పని చేయవలసి వచ్చినది.

ధర్మరాజు : 
ధరించేదేదో అది ధర్మము. ధర్మరాజు ధర్మమునకు ప్రతీక. ఆకాశము సమస్త భూతములను తనలో ధరించునట్లుధర్మరాజు ఆకాశ తత్త్వమై తన బలమును ప్రదర్శిస్తే అది భీమము. స్వచ్ఛమైన తేజస్సుతో ప్రకాశిస్తే అది అర్జునము. వినయ శీలముతో ప్రకాశిస్తే అది నకులము. అన్ని ఒడిదుడుకులను సహిస్తే అది సహదేవము. ఇది క్రమముగా వాయువుఅగ్నిజలముపృథ్వితత్త్వములకు సంకేతములు. ధార్మికమైన బుద్ధిలో మిగిలినవన్నీ ఇమిడి ఉన్నవి. శౌచముబలముపరాక్రమమువినయముసహనము అని అయిదు కలసిన బుద్ధియే ధర్మరాజు. ఇట్టి బుద్దికి ఉన్న ధార్మిక శక్తియే ద్రౌపది.


పురాణ కాలములోని స్త్రీ : 
ధర్మార్థ కామములను పతివ్రతా ధర్మముననుసరించి పతితో పంచుకొని యుండును. పతిని త్రికరణ శుద్ధితో అనుగమించును. వాక్‌చక్షుకర్మలందు సంయమమును పాటించును. సత్త్వరజస్తమో గుణములనెడి త్రిగుణాత్మక ప్రకృతికి సంకేతమైన స్త్రీ పతినే ప్రత్యక్ష దైవముగా సేవించుట వలన ఆ స్త్రీ భగవంతుని సేవించుచున్న భావన కలిగి అట్టి సాధన ద్వారా పరమ పురుషార్థమైన మోక్షమును బడయును.


భారత భాగవతములలోని పురుషార్థములు :
అర్థకామములకు దుర్యోధనుడు ప్రతీక. ధర్మమునకు ధర్మరాజు ప్రతీక. మోక్షమునకు ఎవరూ లేకపోగాపరీక్షిత్తు మహారాజు ప్రతీతిగా ఉండెను. భాగవతములోని పాత్రలు చతుర్విధ పురుషార్థములకు ప్రతీకలుగా నున్నవి. భారతము ధర్మముతో ముగిస్తేభాగవతము మోక్షమును నిర్ణయించుచున్నది. అందువలన భాగవతముభారతమునకు అనుబంధము. ఖిలము అనగా అనుబంధమని అర్థము. అందువలన భాగవతమునకు ఖిల పురాణమని పేరు.

పరమ పురుషార్థము 
ప్రవృత్తి రూపమైన ధర్మార్థ కామములనుఐహికఆముష్మిక ప్రయోజనములుగా నెంచకతీవ్రమైన ఇచ్ఛతో వాటిని నివృత్తి చేసికొనుటవలన తనకు తానే సిద్ధించునది పరమ పురుషార్థమైన మోక్షము.
         మోక్షమనగా వదలినదై సిద్ధమై యున్నది. ముక్తి అనగా విడచినదై యున్నది. అనగా బంధమునుండి విముక్తి రూపమై యున్నది.

జీవప్రవృత్తి : 
మోక్షము గురించి తలంచకసంసారమే స్వర్గమని నిశ్చయించికోరికలతో కర్మల నాచరించుచుజనన మరణ చక్రమునందు తిరుగుట ఏది కలదోదానిని జీవప్రవృత్తి అందురు. కొందరిలో విషయ జ్ఞానముశాస్త్ర జ్ఞానముండును గానిబంధ విముక్తికి ప్రయత్నించరు. ఇది కూడా ప్రవృత్తియే.

నివృత్తి : 
సంసార వ్యవస్థ నిస్సారమనిదీనితో ప్రయోజనము లేదని తలచి నిరతిశయమైన విశ్రాంతి స్థానము అనెడి మోక్షమును నిశ్చయించుకొనిముముక్షువైఆత్మానుభవము కొఱకు సంసార బంధ విముక్తికొఱకు చేసే  సాధనలను నివృత్తి అందురు. స్వానుభవ జ్ఞానమునిర్విషయముస్వప్రకాశ రూపము అనునవి నివృత్తి ఫలము.

ప్రవృత్తి మార్గము 
వేదములలోని దృశ్య భాగమును ప్రతిపాదించు వైదిక  కర్మకాండను సూచించునది ప్రవృత్తి మార్గము. ఇది పరమ పురుషార్థమైన మోక్షమునకు దారి తీయును.

నివృత్తి మార్గము : 
వైదిక కర్మకాండ అనే ప్రవృత్తిని కూడ నివృత్తి చేసికొన్నచో మోక్ష సాధన పురోగమించును. అవిద్యా కామ కర్మలను నివృత్తిచేసికొనే సాధన పద్ధతులే నివృత్తి మార్గము.

ప్రేయస్సు : 
ఇహలోక స్వర్గలోక భోగములపై ఆసక్తిఅవిద్యతాపత్రయ సహితముకర్మానుభవములుఇంద్రియ భోగలాలసఇవన్నీ ప్రేయస్సు అనబడును.

శ్రేయస్సు : 
విద్యజ్ఞానముఅమృతత్వముతాపత్రయ రహితముమోక్షము ఇవన్నీ శ్రేయస్సు అనబడును.

నిశ్రేయస్సు : 
ప్రేయస్సు అనగా దేహాదుల ఇంద్రియ భోగముసుఖములను అపేక్షించినది. శ్రేయస్సు అనగా ముక్తి మార్గమున పురోగమించుట. నిశ్రేయస్సు అనగా శ్రేయమార్గములో గమ్యము చేరినది అనగా మోక్షము.

భవఘ్ని : 
భవమును నశింపజేయునది. భవము అనగా జనన మరణ చక్రము. అందువలన భవఘ్ని అనగా మోక్షము.

బుభుక్షువు  - ముముక్షువు : 
బుభుక్షువు అనగా ఇహలోకమందు సకల ఇంద్రియార్థములను అనుభవింపవలెనను ఇచ్ఛగలవాడు.

ముముక్షువు : 
అనగా అవిద్యా కామ కర్మవాసనల నిశ్శేష వినాశనమునుపరమానంద స్వరూపమైన స్వాత్మ ప్రాప్తిని కోరువాడు.

ముముక్షువునకు ఉండవలసిన గుణములు 
దేనినీ కోరకుండుట. లభించిన దానితో క్షోభపడకుండాప్రాప్తించిన దానితో సంతృప్తి పడుట. తలపెట్టిన పని చెడిపోతే విచారపడకుండ ఉండుట.     ప్రత్యేకముగా సంతోషముగానిఅభిమానము గానిఅపరాధ భావన గానివిచారము గాని లేకుండుట. పొగడితే పొంగకుండుటకొట్టినాతిట్టినాకోపము రాకుండుట. గర్వము లేకుండుట. గౌరవ అగౌరవాదుల భేదము లేకుండుట. వృద్ధులుఅనాధలుతల్లిదండ్రులుపెద్దలువీరికి సేవలందించుట. ఓర్పు సహిష్ణుత ఉండుట. తన పర అను భేదము లేకుండుట. బుద్ధిమంతులకుదైవభక్తులకుజ్ఞానులకు సంతోషము కలిగించుటహాని చేయకుండుటఇంద్రియ జయముశాంత మనస్సునిర్వికార వృత్తి మొదలైనవి కల్గియుండుట.

ఐహిక ఆముష్మికములు : 
ఇహలోకమనగా భూలోకము. ఆముష్మికమనగా స్వర్గము. ఇవేమీ కానిది పరమపదము.

బంధము - మోక్షము 
నేనునీవు ఇతరము అనే శరీరోపాధుల భేదముజగత్తులో నాదినీదిఇతరులది అనే భేదములతో కూడిన అనుభవములుకార్యకలాపములుస్పందన ప్రతిస్పందనలు ఉన్నచో అది బంధము. ఈ చెప్పినవన్నీ దృశ్యములు. ఈ దృశ్యములతో కూడిన బంధము తెగినప్పుడు కేవల దృక్‌గాదృశ్యములు లేని దృక్‌గా మిగిలియుండిఅది సహజమైశాశ్వతమైతే దానిని మోక్షము అందురు. చిత్‌దృశ్యముతో కలిసిపోయి యుండుట బంధము. దృశ్యరహిత చైతన్యమే ఉన్నచో ఆ చిత్‌ స్వరూపమే మోక్షము. బంధమనేది అజ్ఞానానికి స్వయం కల్పితము. జ్ఞానముచేత ఆ కల్పిత బంధము లేనిదని నిశ్చయమగుటయే మోక్షము. బంధవిముక్తి కొఱకు ఏ సాధన చేసిననుఆ క్రియలన్నీ కూడా బంధమే. ఆదర్శములకుసద్గుణములకుక్రమశిక్షణకుయోగాభ్యాసమునకుజ్ఞాన సముపార్జనకుఅన్ని సాధనలకు బంధింపబడి ఉందురు. వాటి అవసరము తీరిన తర్వాత కూడా కొనసాగించుట బంధమునే సూచించును. మమకారమునకుపేరు ప్రతిష్ఠలకుస్వంత ఊహలకుస్వర్గము కావాలనే కోరికకు బంధితులై ఉందురు. జీవితమునకుమోక్షమునకు లక్ష్యములను పెట్టుకొనిఆ లక్ష్యములకు బద్ధులగుచుందురు. స్వభావమువ్యక్తిత్వము కూడా బంధములే. మోక్షేచ్ఛతో అన్నింటినీ వదలి చివరకు మోక్షేచ్ఛను కూడా వదలవలెను.

మోక్షమునకు పేరులు : 
ముక్తిమోక్షముకైవల్యమునిర్వాణనిశ్రేయస్సుఅమృతముఅపవర్గము మొదలగునవి. సాధనమతముఅనుష్ఠానముల బట్టి దీని అర్థములలో కొంత భేదమున్నది.

మోక్ష రూపము : 
సర్వదా సర్వత్రా సర్వము సత్‌ స్వరూపమే అనునది మోక్షరూపము.

ముక్తికి విఘ్నత్రయము : 
1అజ్ఞానము 2. సంశయము 3. విపరీతము 


తత్పరత్వమునకు ప్రతిబంధకములు :

1. అనాశ్వాసము : 
వేద విరుద్ధమైన తర్కముకుత్సితమైన తర్కములను విడనాడి సరియైన విచారణ చేయవలెను. దానివలన మోక్షము ఉన్నదని నిశ్చయమై శ్రద్ధ కలుగును. అనాశ్వాసము నశించును.

2. సంశయము : మోక్షమున్నదో లేదో ననెడి సంశయము.

3. విపర్యయము : 
మోక్షము లేనేలేదని తలచుట. 

సంశయవిపర్యయములు రెండును అనాశ్వాసము క్రిందికి వచ్చును.

2. కామాది వాసనలు : 
ఇవి శ్రవణమునకు ప్రతిబంధకము. వైరాగ్యము చేత ఈ వాసనలను జయించవలెను.

3. జడత్వము : 
ఏ ప్రయత్నమూ చేయవలెనని ఇచ్ఛ కలుగకుండుట. దీనిని ఆత్మోపాసనలేక బ్రహ్మోపాసన చేత పోగొట్టుకొనవలెను.

మోక్షమునకు నాలుగు ద్వారములు :
1. శమము 2. సంతోషము 3. విచారము 4. సాధుసంగమము.

ముక్తికి మార్గము : 
ఓర్పుతో కోపమునునిస్సంకల్పముతో కామమునుసత్త్వగుణ వృద్ధితో తమో రజో గుణములనుధైర్యముతో భయమునుసత్ప్రవర్తనతో మోహమును జయించవలెను. హితవుమితము అయిన భోజనమును సకాలములో చేయుచూ రోగములను పారద్రోలవలెను. దానగుణముతో లోభత్వమునుదయాగుణముతో అధర్మమును పోగొట్టుకొనవలెను.
              చివరకు సత్కర్మాచరణతో ప్రాకృతికవైదిక ధర్మములను కూడా వదలివేయగలిగినప్పుడు పురుషుడు ముక్తుడగును. ధర్మాచరణ మాత్రమే చేసిన కామక్రోధములు మాత్రమే వదలును. కాని ధర్మాచరణ మోక్ష లక్ష్యముతో అసంగముగా చేయుటయుమోక్ష ప్రతిబంధమైన ధర్మాచరణను కూడా వదలుటయు చేయవలెను.

ముక్తి దశ : 
ప్రమాణ పూర్వకముగా ఆత్మ విచారణ చేసేవారిలో ఏ దశలో విచారణ దానికదే ఆగిపోవునోఅనగా ఆత్మ విచారణ యొక్క అవసరము తీరిపోవునో ఆ దశను ముక్తి దశ అందురు.

దశ విధ జ్ఞాన లక్షణములు : 
1. సకలజన ప్రియత్వము 2.శోక రాహిత్యము 3. దాతృత్వము 4. అపార దయ, 5. భయ రాహిత్యము 6. అక్రోధము 7. నిర్లోభత్వము 8. జితేంద్రియత్వము 9. వైరాగ్యము 10. ముముక్షత్వము.

జీవన్మక్తుని షడ్గుణములు :  
సత్యముజ్ఞానముధర్మముదయశాంతిక్షమ. సాధకులు లక్ష్య సాధన కొఱకు వీటిని సాధనగా అభ్యసించవలెను.

త్రిదండి : 
వాగ్దండముమనోదండముకామదండము అని మూడు దండములు కలవాడు అనగా ఆ మూడింటిని దండించి విజయమును సాధించినవాడు. వాగ్దండము వలన మౌనముకర్మదండము వలన వాసనా త్యాగముమనోదండము వలన మనోనాశ్‌ సాధించినవాడు. ఇట్టి త్రిదండి నిజముగా ముక్తుడే.

ఏకదండి : 
జ్ఞానదండిఅనగా జ్ఞాతజ్ఞానముజ్ఞేయములైన త్రిపుటిని జయించిన అద్వయ బ్రహ్మమైనవాడుముక్తుడు.

ఋతము : శ్రుతులచే గమ్యమగునది గాన ఋతము అనగా మోక్షము.

పరము : సత్యత్వము యొక్క ఉత్కృష్టకు అవధి భూతముగాన పరము అనగా మోక్షము.

ప్రణవము : 
ప్ర+ణ+వ= ప్రపంచము+లేదు+నీయందు=నీయందు ప్రపంచము లేదు అని అర్థములో నీవు నిష్ప్రపంచ తత్త్వమైన బ్రహ్మవై యున్నావు అని నిర్ణయముఅనగా మోక్షము.

ఐక్యత - మోక్షము : 
వేరుగా ఉన్నప్పుడే భగవంతుని మీద ప్రేమగానివిరహము గానిఇతరములపై రాగముగానిద్వేషము గాని. ఐక్యత సిద్ధించిన తరువాత ప్రేమ లేదువిరహము లేదురాగద్వేషములు లేవు. ఐక్యతలో అవన్నీ తీరిపోవును. మిగలవు. స్వంతము కాకపోతే అసంతృప్తికోరిక ఉండును. ఐక్యత అనగా స్వంతమగుట. అందులో నిత్యతృప్తి ఉండును. కోరికలుఉద్వేగములు ఉండవు. అవన్నీ తీరిపోవలెను. లేక అవి ఏమీ లేవని తెలిసి ఊరకుండవలెను. అప్పుడు పురుషుడు సృష్టిలోనే ఉంటూ నిర్వికారముగా ఉండును. అదే ఐక్యత లేక అభేద స్థితి. ఐక్యత అనే భావము కూడా పోయినదే నిజమైన ఐక్యత. అదే మోక్షము.

ముక్తి పంచకము :

1. సార్షి ముక్తి 
జగత్తు యొక్క ఉత్పత్తి. అందలి వ్యాపారములను విడచిఉపాసక పురుషుడు ఈశ్వరునికి సమానమైఐశ్వర్యమునుభోగమును పొందుటను సార్ణి ్షముక్తి అందురు.

2. సారూప్య ముక్తి : 
ఉపాసక పురుషునికిఈశ్వరుని యొక్క సమాన రూప ప్రాప్తిని సారూప్యముక్తి అందురు.

3. సామీప్య ముక్తి : ఈశ్వరుని యొక్క సమవర్తిత్వమును సామీప్యముక్తి అందురు.

4. సాలోక్య ముక్తి : ఈశ్వరుని లోకమందు వసించుటను సాలోక్యముక్తి అందురు.

5. సాయుజ్య ముక్తి : 
జీవేశ్వరైక్యమందుజీవుడు లేకపోయిఈశ్వరుడే సహజ సిద్ధమై యుండుటను సాయుజ్య ముక్తి అందురు.

కైవల్యము : 
కేవలము ఆత్మయొక్క అనన్య భావము వలన కేవలాత్మయే సిద్ధించుటను కైవల్యము అందురు.

పరమ పదము : 


ఎక్కడైతే స్థిరముగా ఉండిఎప్పటికీ తిరిగిరామో అట్టి పదము మాత్రము స్వతఃసిద్ధమై శాశ్వతముగా ఉండునోలోకములులోకేశులులోకస్థులు అనెడి త్రిపుటి భ్రాంతి నశించునోతమస్సుపెను చీకటిపరమాత్మ ప్రకాశము అనునవి ఉండవోమాయాత్పరముతత్పరముపరాత్పరముపరమతత్త్వముతత్త్వాతీతముఅచల పరిపూర్ణము అనే పేర్లు సార్థకమోఅది పరమపదము. కార్యకారణములు కానిదిపరోక్షాపరోక్షములు లేనిదిదృక్‌ దృశ్య దర్శన రహితములనే త్రిపుటి రహితముత్రిగుణ రహితము అయినది పరమపదము. బయలే బ్రహ్మముగా సిద్ధమైనది పరమపదము.